అదరగోట్టిన కిరణ్ అబ్బవరం..సెబాస్టియన్ టీజర్ విడుదల
kiran abbavaram | వైవిధ్య భరిత సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక మైన స్థాన్నాన్ని ఏర్పరుచుకున్న నటుడు కిరణ్ అబ్బవరం. రాజావారురాణిగారు, SR కళ్యాణమండపం వంటి సినిమాలతో వరుసగా హిట్లను సాధించాడు. ప్రస్తుతం ఈయన నటిస్తున్న చిత్రం సెబాస్టియన్ పిసి 524. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంటర్టైనమెంట్స్ సంస్థలో జోవితా సినిమాస్ బ్యానర్‌పై సిద్ధారెడ్డి, ప్రమోద్, రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఇక ఈ చిత్రాన్ని ఫిబ్రవరి25న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదలచేశారు.
నీకు రేచికటి ఉన్న విషయం ఎవరికి చెప్పొద్దయ్యా అంటూ మొదలైన టీజర్..పేరెమో క్రిస్టియన్లాగుండాది వచ్చేదెమో గుడికాడ్నుండా అంటూ వచ్చే డైలాగ్ హస్యాస్పదంగా ఉంది. దయగల ప్రభువా ఈ రాత్రి మదనపల్లి పట్టన ప్రజలకు ఏ ఇబ్బంది రాకుండా చూడు తండ్రి నీకు స్తోత్రం. ప్రభువా.. ఒకరాత్రి వీళ్లకు కళ్లు కనపడకుండా చూడు ప్రభువా! ఎన్ని వణుకుతాయో అర్థం కావడం లేదు. దేవుడి బిడ్డలకు రోగాలస్తాయా ఫాదర్ అంటూ కిరణ్ అమాయకంగా అడగడం దానికి ఫాదర్ ప్రభువు తన బిడ్డలని వాటి నుండి దూరంగా ఉంచుతాడు అని చెప్పడం…అంటే నేను దేవుడి బిడ్డను కాను..ప్రభువా నీ బిడ్డను కాని ఈ బిడ్డను కూడా ఏ రోగాలు సమస్యలు రాకుండా చూడు తండ్రి’ అంటూ కిరణ్ అబ్బవరం పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో నువేక్ష, కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇందులో రేచికటున్న పోలీస్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటించనున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

