Kiran Bedi | వారసత్వంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘బ్రహ్మా ఆనందం’ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరైన చిరు.. వారసత్వంపై మాట్లాడారు. తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తనకు మనవడు కావాలని చిరంజీవి అన్నారు. ఈ వ్యాఖ్యలతో ఆయన నెట్టింట ట్రోల్స్ కూడా ఎదుర్కొన్నారు. తాజాగా చిరు వ్యాఖ్యలపై మాజీ ఐపీఎస్ కిరణ్ బేడీ (Kiran Bedi) స్పందించారు. కూతుళ్లు కూడా వారసులేనన్న విషయాన్ని నమ్మండి, గుర్తించండి అని ఆమె హితువు పలికారు.
ఈ మేరకు కిరణ్ బేడీ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ‘చిరంజీవి గారూ.. కూతురు కూడా వారసురాలేనని నమ్మడం. ఎందులోనూ తక్కువ కాదని గ్రహించండి. ఇదంతా మీరు కూతురిని ఎలా పెంచుతారు, ఆమె ఎలా అభివృద్ధి చెందుతుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అమ్మాయిలను పెంచిన తల్లిదండ్రుల నుంచి నేర్చుకోండి. వారిని బాగా చూసుకుంటే.. కుటుంబాలను గర్వపడేలా చేస్తారు. ఇప్పటికే చాలా మంది ఈ విషయాన్ని నిరూపించారు. అమ్మాయిలు ఎందులోనూ తక్కువ కాదు’ అని కిరణ్ బేడీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
#Chiranjeevi ji
Please start believing and realising that a daughter too is a legacy and no less.
It all depends on how u bring up the daughter and how she keeps evolving.
Please learn from parents who brought up their daughters to make a place for themselves and were well… pic.twitter.com/rpl606ruyz— Kiran Bedi (@thekiranbedi) March 3, 2025
కాగా, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam). గతనెల 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా మూవీ రిలీజ్‌కు రెండు రోజుల ముందు ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈ వెంట్‌కు హాజరైన చిరు మాట్లాడారు. తన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తనకు మనవడు కావాలని చిరంజీవి అన్నారు. ‘నేను ఇంట్లో ఉన్నప్పుడు, నా మనవరాళ్లు నా చుట్టూ ఉన్నట్లు అనిపించదు. నేను లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా, చుట్టూ ఆడవాళ్ళతో ఉన్నట్లు అనిపిస్తుంది. చరణ్ ఇప్పటికైన ఒక అబ్బాయిని కను. నా వారసత్వం కొనసాగాలంటే మనువడు కావాలి. కానీ చరణ్‌కి మళ్లీ ఆడపిల్ల పుడుతుందేమో అని నాకు భయంగా ఉంది’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.
He Said I Don’t Want Another Girl Child, So Disrespectful To Women
I’m Sincerely Requesting @narendramodi Sir To Please Ban @KChiruTweets Padmabhusan & Vibhushan Awards Immediately To Save Our Indian Culture & Femininity 🙏🏻#ChiranjeeviMisogynyUnmasked pic.twitter.com/5IuWcyHXaM
— Smudge (@Okkkaduu) February 12, 2025
Also Read..
Rashmika Mandanna | కన్నడను విస్మరించిన రష్మికకు గుణపాఠం చెప్పాలి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే
Oscar Awards | వేశ్య కథకు అవార్డుల పంట.. తక్కువ బడ్జెట్‌తో విడుదలై రికార్డులు కొల్లగొట్టిన అనోరా
Subhalagnam | శుభలగ్నం సినిమా గురించి ఆమని పంచుకున్న ఆసక్తికర విషయాలు ఇవే..!