Subhalagnam | చిత్రాలు ఎంత పెద్ద హిట్ అయ్యావని కాదు, జనాల మదిలో ఎంతగా గుర్తుండిపోయాయి అన్నది ముఖ్యం. టాలీవుడ్లో కొన్ని చిత్రాలు ఇప్పటికీ ప్రేక్షకుల మదిలో మెదులుతూనే ఉంటాయి. వాటిలో ఒకటి శుభలగ్నం. అప్పట్లో స్టార్ డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్న కృష్ణా రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటి ఆమని కథనాయికగా నటించింది. ‘జంబ లకిడి పంబ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమని ఆ తర్వాత మిస్టర్ పెళ్లాం చిత్రంతో తన సత్తా నిరూపించుకుంది.
శుభలగ్నం సినిమా గురించి ఆమని పంచుకున్న ఆసక్తికర విషయాలు ఇవే..!
ఇక అప్పటి నుండి నటనకి ప్రాధాన్యం ఉన్న సినిమాలే చేశారు ఆమని. అయితే ఆమని కెరీర్లో శుభలగ్నం ఓ మరపురాని చిత్రం. అయితే ఈ చిత్రంకి సంబంధించి ఆమని ఓ సందర్భంలో ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకుంది. ఆమనికి మొదటి నుంచీ సినిమా కథ వినడం చేయదట. తను దర్శకులని బాగా నమ్ముతుంది. వారు మంచి పాత్రలని ఇస్తారని ఎక్కువగా నమ్ముతుంటుంది. అయితే తనకు అవకాశం ఇచ్చిన దర్శకులంతా పెద్దవారు కావడంతో అలా అడగాలని కూడా ఆమని అనుకోదట. ఒకటి మాత్రం వారిని మొహమాటం లేకుండా అడుగుతుందట. సినిమాలో నేనే హీరోయిన్ కదా అని అడుగుతుందట.
ఎస్వీ కృష్ణారెడ్డి అప్పుడు టాప్ డైరెక్టర్ కావడంతో అతని మీద ఉన్న నమ్మకంతో ఓకే చేసిందట ఆమని. అయితే షూటింగ్ మొదటి రోజుల్లో బాగానే చేసిన ఆమని ఆ తర్వాత మాత్రం ఆమెలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. అందుకు కారణం సెకండాఫ్‌లో ఆమని క్యారెక్టర్స్‌లో కాస్త నెగటివ్ షేడ్స్ కనిపించడం. అంతే కాదు రోజా పాత్ర తనని డామినేట్ చేస్తుందేమో, హీరోయిన్ క్యారెక్టర్ క్రెడిట్ అంతా రోజాకి పోతుందేమోనని ఆమని అనుకుందట. ఇక శుభలగ్నం సినిమాలో సుహాసిని గెస్ట్ రోల్ చేయగా, అప్పుడు కృష్ణారెడ్డి.. సుహాసినికి కథ వినిపించాడు. అప్పుడు ఆమని కూడా కథ విన్నది. అయితే కథ చెప్పడం పూర్తయ్యాక సుహాసని.. ఈ సినిమాతో ఆమనికి చాలా మంచి పేరు వస్తుంది. క్యారెక్టరైజేషన్ చాలా బాగుందని సుహాసిని అన్నప్పుడు నాకు నా క్యారెక్టర్‌పై నమ్మకం కుదిరిందని ఆమని స్పష్టం చేశారు. ఇక గోవిందా గోవిందా’ సినిమా వల్ల దత్తుగారికి వచ్చిన నష్టాలని ఈ సినిమాతె తీర్చేయడమే కాకుండా.. ‘శుభలగ్నం’ కి పెట్టిన బడ్జెట్ కు పదింతలు లాభాలు రావడం విశేషం.