‘క’ సినిమాతో గత ఏడాది మంచి విజయాన్ని అందుకున్న యువ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ రూబా’. విశ్వకరుణ్ దర్శకుడు. శివమ్ సెల్యూలాయిడ్స్, సారెగమ మ్యూజిక్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రుక్సర్ థిల్లాన్ కథానాయిక. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. సంక్రాంతి సందర్భంగా కొత్త లుక్‌ను విడుదల చేశారు. ఇందులో కిరణ్ అబ్బవరం ఉత్సాహభరితమైన మూడ్‌లో కనిపిస్తున్నారు.
‘లవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. కిరణ్ అబ్బవరం పాత్ర గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది. చక్కటి ప్రేమకథతో పాటు పవర్ఫుల్ యాక్షన్, కామెడీ అంశాలతో ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్‌కు మంచి స్పందన లభిస్తున్నది’ అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, ప్రొడక్షన్ డిజైనర్: సుధీర్, నిర్మాతలు: రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ, రచన-దర్శకత్వం: విశ్వకరుణ్.