కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’ కశ్మీరా కథానాయిక. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. శనివారం ఈ చిత్రం సెన్సార్ పూర్తిచేసుకుంది. ఈ నెల 18న చిత్రం విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ ‘ ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ప్రచార చిత్రానికి మంచి స్పందన వస్తోంది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రూపొందుతున్న క్లీన్ ఎంటర్టైనర్ ఇది. సెన్సార్ సభ్యులు ‘యుఏ’ సర్టిఫికెట్‌ను అందించారు. తప్పకుండా చిత్రం ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : చైతన్ భరద్వాజ్.