కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న రొమాంటిక్ ప్రేమకథ ‘దిల్ రూబా’. రుక్సర్ థిల్లాన్ కథానాయిక. విశ్వ కరుణ్ దర్శకుడు. రవి, జోజో జోస్, రాకేష్‌రెడ్డి, సారెగమ నిర్మాతలు. ఈ నెల 14న సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమాలోని పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘కన్నా.. నీ ప్రేమ సంద్రమే.. నేను నీ తీరమే.. కన్నా.. నువ్వు నా ప్రాణమే.. నేను నీ దేహమే..’ అంటూ సాగే ఈ గీతాన్ని భాస్కరభట్ల రవికుమార్ రాయగా, సామ్ సీస్ స్వరపరిచారు.
సత్యప్రకాష్, మాళవిక సుందర్ ఆలపించారు. ‘అలలుగా తాకగానే కరిగిపోనా నీలో.. ప్రళయమై తాండవిస్తే అలజడే నాలో..’ అనే హృద్యమైన పదాలతో ప్రేమభావాన్ని వ్యక్తీకరిస్తూ ఈ పాట తీర్చిదిద్దబడిందని, యువతరాన్ని ఉర్రూతలూగించే ప్రేమకథ ఇదని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: డానియేల్ విశ్వాస్.