Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తుంది చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్‌ను విడుదల చేసిన చిత్రయూనిట్ ట్రైలర్ అప్డేట్ను పంచుకుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకను జూలై 26న తిరుపతిలో జరుపబోతున్నట్లు విజయ్ దేవరకొండ ఎక్స్ వేదికగా ప్రకటించాడు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకున్నాడు.
#KINGDOM
Trailer is coming.JULY 26th – Tirupati 🙏❤️ pic.twitter.com/a5t3mZukeU
— Vijay Deverakonda (@TheDeverakonda) July 22, 2025