Vijay Devarakonda | రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్డమ్’. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం జూలై 31న ప్రపంచవ్యాప్తంగా తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ చిత్రం జులై 31న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా.. సినిమా విడుదలైన రోజు నుంచి 10 రోజుల వరకు రేట్లు పెంచడానికి ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇక పెరిగిన ధరలను బట్టి చూసుకుంటే సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 పెంచుకోవడానికి అనుమతినివ్వగా.. మల్టీప్లెక్స్‌లలో రూ.75 పెంచుకునేందుకు అవకాశం కల్పించారు. మరోవైపు టికెట్ ధరలను పెంచాలంటూ చిత్రబృందం తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోరినట్లు తెలుస్తుంది.