Kingdom Movie | అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్తో దూసుకుపోతుంది. జెర్సీ వంటి ఎమోషనల్ డ్రామా తర్వాత గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండతో కలిసి స్పై యాక్షన్ జానర్లో సినిమా చేయడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతుంది. తాజాగా ఈ చిత్రం మూడు రోజుల్లో రూ.67 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్ను విడుదల చేసింది.
భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సత్యదేవ్, మలయాళం నటుడు వెంకీటేశ్ కీలక పాత్రల్లో నటించారు. గౌతమ్ డైరెక్షన్, స్క్రీన్ ప్లే, అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్.. విజయ్, సత్యదేవ్ యాక్టింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయని కామెంట్లు పెడుతున్నారు.
A Rampage fit for a King 👑 #Kingdom SMASHES 𝟔𝟕 𝐂𝐫+ 𝐖𝐨𝐫𝐥𝐝𝐰𝐢𝐝𝐞 𝐆𝐫𝐨𝐬𝐬 𝐢𝐧 𝟑 𝐝𝐚𝐲𝐬
& All set to end the weekend with a BLOCKBUSTER houseful Sunday 🤟🏻🎟️ – https://t.co/4rCYFkA5dI#BoxOfficeBlockbusterKingdom@TheDeverakonda @anirudhofficial @gowtam19… pic.twitter.com/3nvQLbeqM2
— Sithara Entertainments (@SitharaEnts) August 3, 2025