Kingdom Promotions | టాలీవుడ్ స్టార్ కథానాయకుడు విజయ్ దేవరకొండ మరో వారం రోజుల్లో(జూలై 31) కింగ్డమ్(Kingdom) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైనమెంట్స్పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. యాక్షన్ బ్యాక్డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటిస్తుంది.. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. జూలై 31న ఈ సినిమా రాబోతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రయూనిట్.
ఇందులో భాగంగా చిత్రబృందం ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ‘కింగ్డమ్ బాయ్స్ పాడ్కాస్ట్’ పేరుతో ఒక ప్రత్యేక ఇంటర్వ్యూను విడుదల చేసింది. ఈ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, విజయ్ దేవరకొండ ఉన్నారు. ఈ పాడ్ కాస్ట్లో కింగ్డమ్ సినిమా విషయాలతో పాటు సందీప్ అప్కమింగ్ ప్రాజెక్ట్ స్పిరిట్, విజయ్ అప్కమింగ్ చిత్రాలపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తుంది.