నాగార్జున తన వందవ సినిమాను నిశ్శబ్దంగా మొదలుపెట్టారు. రా.కార్తీక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇందులో టబు ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో క్రేజీ అప్డేట్ బయటకొచ్చింది. అనుష్కను ఇందులో కథానాయికగా తీసుకుంటున్నారట. చర్చలు కూడా దాదాపుగా పూర్తయ్యాయని తెలుస్తున్నది.
అనుష్కను ‘సూపర్’ సినిమాతో నాగార్జునే టాలీవుడ్‌కి పరిచయం చేశారు. ఆ తర్వాత డమరుకం, రగడ చిత్రాల్లో వారిద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు ఆయన వందవ సినిమాలో కూడా స్వీటీనే కథానాయికగా నటించడం నిజంగా ఆసక్తికరమైన విషయమే. ఇదిలావుంటే.. దర్శకుడు రా.కారీక్ ఈ సినిమాను ఓ పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నారట. ఇందులో ఓ హీరోయిన్ లేడీ సీఎంగా కనిపిస్తారని తెలుస్తున్నది. నాగచైతన్య, అఖిల్ కూడా ఇందులో గెస్ట్రోల్స్ చేస్తున్న విషయం తెలిసిందే.