King Of Kotha | దుల్కర్ సల్మాన్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. బర్త్ డేకు ట్రిపుల్ బొనాంజా..!
King Of Kotha | పాన్ ఇండియా స్థాయి ఇమేజ్ ఉన్న మలయాళ స్టార్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు (Dulquer Salmaan Birthday) రేపు (జులై 28). ఈ సందర్భంగా అభిమానులు బర్త్ డే జరిపేందుకు రెడీ అవుతున్నారు.
King Of Kotha | పాన్ ఇండియా స్థాయి ఇమేజ్ ఉన్న మలయాళ స్టార్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan). మూవీ లవర్స్‌తోపాటు అభిమానులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. భాషతో సంబంధం లేకుండా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు (Dulquer Salmaan Birthday) రేపు (జులై 28). ఈ సందర్భంగా అభిమానులు బర్త్ డే జరిపేందుకు రెడీ అవుతున్నారు. బర్త్ డేన బ్యాక్ టు బ్యాక్ ట్రీట్స్ రాబోతున్నాయన్న అప్డేట్ ఒకటి దుల్కర్ సల్మాన్ అభిమానుల్లో జోష్ నింపుతోంది.
ఈ టాలెంటెడ్ యాక్టర్ ప్రస్తుతం కింగ్ ఆఫ్ కోట (King Of Kotha)లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ అభిలాష్ జోషి డైరెక్షన్లో గ్యాంగ్‌స్టర్ డ్రామా నేపథ్యంలో వస్తోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రేపు విడుదల చేయనున్నారు. దుల్కర్ సల్మాన్ మరోవైపు టాలీవుడ్ యువ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. ఈ సినిమా టైటిల్‌ను రేపు ప్రకటించబోతున్నట్టు సమాచారం. వెంకీ అట్లూరి మూవీకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. పాన్ ఇండియాస్థాయిలో రాబోతున్న ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో ఫ్యార్చూన్ ఫోర్ సినిమాస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై సాయి సౌజన్య, నాగవంశి తెరకెక్కిస్తున్నారు.
అంతేకాదు దుల్కర్ సల్మాన్ కొత్త సినిమాను కూడా ప్రకటించబోతున్నట్టు ఇండస్ట్రీ సర్కిల్ ఇన్సైడ్ టాక్. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన కింగ్ ఆఫ్ కోట ఫస్ట్ లుక్ పోస్టర్‌తోపాటు టీజర్ (King Of Kotha teaser) నెట్టింట హల్ చల్చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. సూపర్ బజ్ క్రియేట్ చేస్తున్నాయి. ఈ మూవీ ఆగస్టు 25న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇటీవలే విడుదల చేసిన కింగ్ ఆఫ్ కోట మోషన్ పోస్టర్, టీజర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ చిత్రాన్ని వేఫరెర్ ఫిలిమ్స్-జీ స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కిస్తుండగా.. షాన్ రెహ్మాన్, జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
కింగ్ ఆఫ్ కోటలో ప్రసన్న, ఐశ్వర్య లక్ష్మి, నైలా ఉషా, చెంబన్ వినోద్, గోకుల్ సురేశ్, షమ్మీ తిలకన్, శాంతి కృష్ణ, వడా చెన్నై శరన్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఓనమ్ 2023 కానుకగా పాన్ ఇండియా స్థాయిలో మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుంది.
3 updates loading tomorrow as #DulquerSalmaan‘s Birthday special 🎉
🔹#KingOfKotha – First single
🔹VenkiAtluri movie – Title announcement
🔹New movie announcement (Expected)#HBDDulquerSalmaan pic.twitter.com/gcOF5DpAXC— AmuthaBharathi (@CinemaWithAB) July 27, 2023
కింగ్ ఆఫ్ కోట టీజర్..
Welcoming the Enchanting Composer @gvprakash onboard for another BLOCKBUSTER Collaboration 💥🎵🎹
Team #Production24 wishes you a very Happy & musical Birthday! #HBDGVPrakash 🥳@dulQuer #VenkyAtluri @vamsi84 #SaiSoujanya @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/40aOoqFS2S
— Sithara Entertainments (@SitharaEnts) June 13, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Krithi Shetty | చూపులతోనే కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తున్న కృతి శెట్టి!
Keerthy Suresh | చీరకట్టులో కీర్తి సురేష్ అందాల విందు.. చూపులతోనే కుర్రాళ్లకు చెక్!
చేవెళ్లలో ఫామ్‌హౌస్ పార్టీపై పోలీసుల దాడి.. 25 మంది విద్యార్థులు అదుపులోకి!
Mrunal Thakur | చీరకట్టులోనూ మత్తెక్కించే అందాలు.. మృణాల్ ఠాకూర్ గ్లామర్ షో అదుర్స్!
IND vs NZ | ఫిలిప్స్ విధ్వంసం.. భారత్‌కు 87 పరుగుల భారీ ఓటమి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

