బీ టౌన్ మొదటి సినిమాతోనే భావితరం యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు లక్ష్ లాల్వానీ. టీవీ సీరియల్స్‌తో ఇంటింటికీ పరిచయమైన ఈ అందగాడు.. ‘కిల్’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించడం విశేషం. ‘పోరస్’ సీరియల్లో పురుషోత్తముడిగా మెప్పించిన లక్ష్ బాలీవుడ్లో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యం అని చెబుతున్నాడు. ‘నాకు నటనపై పెద్దగా ఆసక్తి ఉండేది కాదు.
ప్రకృతిలో అనుకోకుండా కొన్ని జరిగిపోతుంటాయి కదా, నేను నటుణ్ని కావడం కూడా అలాంటిదే! నాకు పద్దెనిమిదేండ్లు ఉన్నప్పుడు ఢిల్లీ నుంచి మంబై వెళ్లాను. అక్కడ సీరియల్స్‌లో అవకాశం వచ్చింది. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటూ పోయాను. నటుడికి ఇంత ఆదరణ ఉంటుందని అర్థమయ్యాక.. యాక్టింగ్‌ను సీరియస్‌గా తీసుకున్నాను. టెలివిజన్ నాకు ఎన్నో పాఠాలు నేర్పింది. ఆ అనుభవం ‘కిల్’ సినిమాకు ఎంతగానో ఉపయోగపడింది. బాలీవుడ్లో నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇది విజయవంతంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాన’ని చెప్పుకొచ్చాడు లక్ష్.