Kiara Advani | సినీ రంగంలో పోటీ గురించి అస్సలు ఆలోచించనని, ప్రతి చిత్రాన్ని ఓ సవాలుగా భావిస్తు నటిగా పరిణతి సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పింది బాలీవుడ్ అగ్ర నటి కియారా అద్వాణీ. ప్రస్తుతం ఈ భామ ‘గేమ్ ఛేంజర్’ ‘వార్-2’ వంటి చిత్రాల్లో నటిస్తున్నది. వివాహానంతరం కెరీర్ మరింత ఊపందుకుందని, కథల ఎంపికలో కూడా తన ప్రాధాన్యతలు మారాయని చెప్పిందీ భామ.
ఆమె మాట్లాడుతూ ‘ఇండస్ట్రీలో ప్రతీ నటికి కొన్ని ప్రత్యేకతలుంటాయి. అందుకే కెరీర్పరమైన పోటీ గురించి పట్టించుకోను. వృత్తిపరంగా గత ఏడాది కంటే నేడు ఎంత మెరుగ్గా ఉన్నామన్నదే నాకు ప్రధానం. నాతో నేను పోటీ పడుతూ ఉత్తమ నటిగా పరివర్తన పొందే క్రమాన్ని ఆస్వాదిస్తున్నా. కాలం గడుస్తున్న కొద్ది మన ప్రతిభాపాటవాల్లో ఎంతో కొంత మార్పు ఉండాలి. అలా లేకుంటే సమయం వృథా అయినట్లే. రెండేళ్ల క్రితంతో పోల్చితే సినిమాల ఎంపికలో మరింత పరిణతి వచ్చింది. నటిగా నా ప్రయాణం గర్వంగా ఉంది’ అని చెప్పుకొచ్చింది.