ఆ రోజు చావు ఖాయమనుకున్నా.. అప్పుడే ప్రాణం విలువ తెలిసొచ్చింది అంటున్న కియారా
Kiara Advani | అందం, అభినయం కలబోసినట్టు ఉంటుంది కియారా అడ్వానీ. ఈ బాలీవుడ్ భామ ‘ధోని-ది అన్‌టోల్డ్ స్టోరీ’, ‘భరత్ అను నేను’, ‘వినయ విధేయ రామ’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ‘దయ్యాల సినిమాలంటే భయం’.. అంటూనే హారర్ థ్రిల్లర్ ‘భూల్‌భులైయా-2’తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కియారా తన గురించి పంచుకున్న ముచ్చట్లు..
కాలేజీ రోజుల్లో విహారయాత్రకు ధర్మశాలకు వెళ్లాం. విపరీతమైన మంచు. దాదాపు నాలుగు రోజులు గదిలోనే ఉండిపోయాం. నీళ్లు కూడా లేవు. వేడికోసం వేసిన క్యాంప్ ఫైర్ సైతం ఆరిపోయింది. నేను గాఢ నిద్రలో ఉన్నప్పుడు.. మంచం పక్కనే ఉన్న కుర్చీకి మంట అంటుకుంది. సమయానికి మా ఫ్రెండ్ చూసింది కాబట్టి సరిపోయింది. వెంటనే మంటలు ఆర్పేసింది. గదినిండా పొగ.. ఎటూ వెళ్లడానికి లేదు. చావు ఖాయమనుకున్నా. మేం గట్టిగా అరవడంతో పక్క రూంలోని వాళ్లు తలుపులు పగులగొట్టారు. అప్పడే, ప్రాణం విలువ
తెలిసొచ్చింది. ఆ సంఘటన తర్వాత నా ఆలోచనా ధోరణిలో మార్పు వచ్చింది.
♦ ♦ ♦
చిన్నప్పటి నుంచీ నాకు డ్యాన్స్, మ్యూజిక్ ఇష్టం. కల్చరల్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొనేదాన్ని. నటిని అవుతానని ఇంట్లో చెప్పడానికి మాత్రం భయమేసేది. ఎందుకంటే మేం ఉంటున్న పశ్చిమ ముంబైలో హిందీ సినిమాలు తక్కువగా చూస్తారు. దీంతో హేళన చేస్తారని చెప్పలేదు. కాలేజీ రోజులకు వచ్చేసరికి.. సినిమాలే నా కెరీర్ అని నిర్ణయించుకున్నా. శిక్షణ కూడా తీసుకున్నా. ఇలా ఈరోజు మీ ముందున్నా.
♦ ♦ ♦
నా ధైర్యం, రోల్ మోడల్ మా అమ్మ. నా విజయానికి కారణమూ తనే. నాలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించింది. ‘మనం సంతోషంగా ఉండాలనుకుంటే హాయిగా నవ్వగలగాలి. అప్పుడే మన మెదడు మనం సంతోషంగా ఉన్నామని భావిస్తుంది. ఆ భావన మంచి ఆలోచనలకు, ప్రశాంతతకు దారితీస్తుంది’ అని చెబుతూ ఉంటుంది అమ్మ. ఆ సూత్రాన్నే నేను ఫాలో అవుతా.
♦ ♦ ♦

ఏదైనా సినిమా చూసినప్పుడు హీరోయిన్ పాత్ర నచ్చితే, వెంటనే కాల్ చేసి శుభాకాంక్షలు చెబుతాను. నాకూ చాలామంది ఫోన్ చేస్తారు. ఒకరినొకరు ప్రోత్సహించుకోవడం వల్ల మంచి వాతావరణం ఉంటుంది. మగవారితో పోలిస్తే ఆడవాళ్లే స్నేహితులతో ఎక్కువ ఆనందంగా గడుపుతారు. నాతోపాటు ‘గిల్టీ’ సినిమాలో నటించిన ఆకాంక్ష మంచి స్నేహితురాలు. అలియా భట్, అనన్య పాండే, జాన్వీ కపూర్.. ఎక్కడ కలిసినా బాగా మాట్లాడుకుంటాం.
♦ ♦ ♦
బలమైన బంధానికి కావలసింది అర్థం చేసుకునే మనస్తత్వం, నమ్మకం. ఒకరినొకరు గౌరవించుకోవాలి. దాపరికం లేకుండా అన్ని విషయాలనూ పంచుకోగలగాలి. మాట్లాడుకోవడానికి అహం అడ్డురాకూడదు. అప్పుడే ఆ బంధం దీర్ఘకాలం కొనసాగుతుంది. కాబోయే జీవిత భాగస్వామిలోనూ ఈ లక్షణాలను కోరుకుంటాను.
♦ ♦ ♦
నాకు హారర్ సినిమాలంటే భయం. ఒంటరిగా చూసే ధైర్యం చేయను. రొమాంటిక్ ఫీల్ ఉంటే చివరివరకూ చూస్తా. ‘దిల్వాలే దుల్హానియా లేజాయేంగే’, ‘పి.ఎస్. ఐ లవ్ యూ’,
‘ది డెవిల్ వేర్స్ ప్రద’.. నాకిష్టమైన సినిమాల లిస్ట్ చాలా పెద్దది. మ్యూజిక్ వినడం అంటే చాలా ఇష్టం. అయితే, నాకిష్టమైన పాటల జాబితా మారుతూ ఉంటుంది.
♦ ♦ ♦
మిలియన్ల కొద్ది అభిమానుల్ని సంపాదించుకోవడం నా అదృష్టం. నేను సున్నిత మనస్కురాలిని. మొదట్లో రూమర్స్, ట్రోలింగ్ గురించి బాధపడేదాన్ని. కానీ నేనున్న రంగంలో అదంతా సహజం. నేనేంటో తెలియని వాళ్లు, నాకు తెలియని వాళ్లు మాట్లాడిన మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదనే స్థిర నిర్ణయానికి వచ్చాను.
Read More :
Kiara Advani | వైట్ కలర్ టైట్‌ఫిట్ డ్రెస్‌లో కియారా అద్వానీ మెరుపులు..
“Kiara Advani | కియారా అద్వానీ స్లీవ్ లెస్ అందాలు అదరహో..”
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

