Game Changer | రామ్చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మిస్తున్నారు. కియారా అద్వాణీ కథానాయిక. ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేయబోతున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత రామ్చరణ్ నటిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలేర్పడ్డాయి. గురువారం నుంచి హైదరాబాద్లో కొత్త షెడ్యూల్ మొదలైంది. ప్రధాన తారాగణంపై కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు.
త్వరలో రామ్చరణ్ ఈ షెడ్యూల్లో జాయిన్ కాబోతున్నారు. సమకాలీన రాజకీయ, సామాజిక అంశాలను చర్చిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపిస్తారు. కియారా అద్వాణీ, అంజలి, సముద్రఖని, ఎస్.జె.సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఎస్.తిరుణావుక్కరసు, సంగీతం: తమన్, సంభాషణలు: సాయిమాధవ్ బుర్రా, నిర్మాతలు: దిల్రాజు-శిరీష్, దర్శకత్వం: శంకర్.