టాలీవుడ్ (Tollywood) యాక్టర్ రవితేజ (Ravi Teja) నటిస్తోన్న తాజా చిత్రం ఖిలాడి (Khiladi). రమేశ్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో డింపుల్ హయతి (Dimple Hayathi) , మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. ఫిబ్రవరి 11న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. అయితే ఇప్పటివరకు మేకర్స్ మాత్రం ట్రైలర్ ను విడుదల చేయలేదు. కాగా మరోవైపు ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లాభదాయకంగా సాగుతున్నట్టు టాక్. తాజాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజ్ అప్ డేట్‌ను మేకర్స్ అందించారు.
ఖిలాడీ నుంచి దేశీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఐదో పాట క్యాచ్ మీని ఫిబ్రవరి 5న లాంఛ్ చేయనున్నారు మేకర్స్. ఈ సాంగ్‌కు సంబంధించిన డింపుల్ హయతి లుక్ ఒకటి ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఈ పాటకు వైట్ కలర్ డ్రెస్‌లో అందాలను ఆరబోస్తూ డ్యాన్స్ చేస్తూ..అందరినీ మెస్మరైజ్ చేస్తోంది డింపుల్ హయతి. ఏ స్టూడియోస్ బ్యానర్‌పై కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ సార్జా, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
రవితేజ మరోవైపు సుధీర్ వర్మ (Sudheer Varma) దర్శకత్వంలో చేస్తున్న రావణాసుర (Ravanasura) షూటింగ్‌ను కూడా మొదలుపెట్టాడు. దీంతోపాటు డెబ్యూ డైరెక్టర్ శరత్ మండవతో కలిసి రామారావు ఆన్ డ్యూటీ కూడా చేస్తున్నాడు.
Cant wait for this one for you’ll to see Explosive Song of the year #CatchMe #𝐊𝐡𝐢𝐥𝐚𝐝𝐢 #KhiladiOnFeb11th @RaviTeja_offl @DirRameshVarma @ThisIsDSP @DimpleHayathi @Meenakshiioffl #KoneruSatyanarayana @AstudiosLLP @sagar_singer @ShreeLyricist @adityamusic pic.twitter.com/vSdbr86SWa
— Dimple Hayathi (@DimpleHayathi) February 2, 2022