Ravi Basrur |టాలీవుడ్ హీరో గోపీచంద్ (Gopichand) కొత్త సినిమా ఇవాళ ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. గోపీచంద్ 31గా (GopiChand31) వస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు కన్నడ డైరెక్టర్ ఏ హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. కన్నడలో పలు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన ఏ హర్ష ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కాగా ఈ చిత్రానికి కాంతార, కేజీఎఫ్ లాంటి సినిమాలకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన రవి బస్రూర్ (Ravi Basrur) సంగీతం అందిస్తున్నాడు. ఈ రెండు ట్రెండ్ సెట్టర్స్ లో రవి బస్రూర్ గూస్ బంప్స్ తెప్పించే బీజీఎంతో అదరగొట్టేశాడు.
ప్రస్తుతం ఈ కన్నడ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్- ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సలార్‌కు మ్యూజిక్ అందిస్తున్నాడు. రవి బస్రూర్ ఇప్పడు తాజాగా గోపీచంద్ 31కు కూడా పనిచేస్తుండటం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. ప్రభాస్- గోపీచంద్ మంచి స్నేహితులని తెలిసిందే. ప్రభాస్‌తో సలార్‌కు పనిచేస్తు్న్న సమయంలోనే గోపీచంద్ 31కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. రవిబస్రూర్ పేరును ప్రభాస్ స్వయంగా సూచించాడా..? అంటూ తెగ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. మరి కేజీఎఫ్ కంపోజర్ గోపీచంద్‌కు ఎలాంటి బీజీఎం ఇస్తాడో చూడాలంటున్నారు సినీ జనాలు.
ఏ హర్ష ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న గోపీచంద్ 31 రెగ్యులర్ షూటింగ్ ఈ నెల చివరలో షురూ కానుంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గోపీచంద్ 31 ప్రాజెక్ట్‌కు స్వామి జే సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఇందులో నటించే యాక్టర్లు, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలపై మేకర్స్ రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు.
గోపీచంద్ 31 లాంఛింగ్ స్టిల్స్..
#GopiChand31 launched Today with a formal Pooja ceremony ✨@SriSathyaSaiArt joined hands with Macho🌟 @YoursGopichand for their Production No. 14🎉
Directed by @nimmaaharsha
Produced by #KKRadhamohan
Music @ravibasrur
DOP #JSwamyRegular shoot 🎥 Begins this month🎊 pic.twitter.com/SG5iDBmGEB
— Sri Sathya Sai Arts (@SriSathyaSaiArt) March 3, 2023
Gopichand 31 | రూటు మార్చిన గోపీచంద్.. ఈ సారి కన్నడ డైరెక్టర్‌తో కొత్త సినిమా
Venkatesh | వెబ్ షోకు పనిచేయడం చాలా డిఫరెంట్.. వెంకటేశ్ చిట్ చాట్
Custody | స్టన్నింగ్‌గా మరో ఫస్ట్ లుక్.. కస్టడీలో అరవింద్ స్వామి
Allu arjun | అల్లు అర్జున్ అరుదైన రికార్డు.. సౌత్ నుంచి తొలి నటుడిగా..