‘బలగం’ చిత్రంలో గ్రామ సర్పంచ్ పాత్రలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న కీసరి నర్సింగం మంగళవారం కన్నుమూశారు. ఆయన గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసింది. కీసరి నర్సింగం మరణవార్తను ‘బలగం’ చిత్ర దర్శకుడు వేణు యెల్దండి సోషల్మీడియా వేదికగా పంచుకొని శ్రద్ధాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా నర్సింగంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘నర్సింగం బాపుకి శ్రద్ధాంజలి, మీ చివరి రోజుల్లో ‘బలగం’ సినిమా ద్వారా మీలోని నటుణ్ని చూసుకొని మీలోని కళాకారుడు తృప్తి చెందడం నేను అదృష్టంగా భావిస్తున్నా. ‘బలగం’ సినిమా కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు ముందుగా నర్సింగం బాపునే కలిశాను’ అని వేణు యెల్దండి ఎక్స్ (ట్విట్టర్)లో పేర్కొన్నారు.