‘నమ్మిన దానికోసం నిలబడే ధైర్యశాలి పాత్రను ‘రఘు తాత’లో పోషించాను. ఆ పాత్రకు జీవం పోయడం నిజంగా సవాలుగా అనిపించింది. ఇప్పుడు ఓటీటీ ద్వారా ఈ పాత్ర ప్రపంచానికి చేరవ అవుతుండటం చాలా ఆనందంగా ఉంది’ అంటున్నది జాతీయ ఉత్తమనటి కీర్తిసురేశ్. ఆమె ప్రధాన పాత్ర పోషించిన తమిళ చిత్రం ‘రఘు తాత’.
హోంబళే ఫిల్మ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రానికి సుమన్ కుమార్ దర్శకుడు. తమిళనాట థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సెప్టెంబర్ 13న ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా కీర్తి సురేశ్ ఆనందం వ్యక్తం చేసింది. సున్నితమైన హాస్యంతో సామాజిక సమస్యలపై స్పందిస్తూ తీసిన ఈ సినిమా తమకెంతో ప్రత్యేకమని నిర్మాత విజయ్ కిరగందూర్ అన్నారు. ‘రఘు తాత’ అన్ని భాషలకూ చేరువ అవుతుండటం పట్ల దర్శకుడు సంతోషం వెలిబుచ్చారు.