గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యత ఇవ్వకుండా నటనకు ఆస్కారమున్న చిత్రాల్లో నటిస్తూ వెర్సటైల్ యాక్ట్రెస్‌గా పేరు తెచ్చుకుంది కీర్తి సురేష్. దక్షిణాది చిత్ర పరిశ్రమల్లో అగ్ర నాయికగా ఎదిగింది. ఈ క్రమంలో నాయిక ప్రధాన చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది కీర్తి. ఈ తరహాలో ఆమె నటిస్తున్న మరో కొత్త సినిమా ‘రివాల్వర్ రీటా’. ఫీమేల్ సెంట్రిక్ మూవీగా దర్శకుడు చంద్రూ రూపొందిస్తున్నారు. రెడిన్ కింగ్ల్సే మరో కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఇటీవలే ప్రకటించారు. తాజాగా
చిత్ర విశేషాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..‘నాయిక ప్రధాన చిత్రాలంటే సీరియస్‌గా సాగే సబ్జెక్ట్ ఉంటుందని అనుకుంటారు కానీ ఈ చిత్రం యాక్షన్ కామెడీ జానర్లో తెరకెక్కిస్తున్నాం. మధ్య తరగతికి చెందిన యువతి రీటా పాత్రలో కీర్తి సురేష్ కనిపిస్తారు. అప్పటిదాకా సాధారణ జీవితం గడిపే ఆమె ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాక ఎలా ప్రతిస్పందిస్తుంది, ఆమె తుపాకీ పట్టి ఏం చేసింది? అనేది ఆసక్తికరంగా చూపిస్తున్నాం. మార్చి లేదా ఏప్రిల్‌లో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభించబోతున్నాం’ అన్నారు.