జయాపజయాలతో సంబంధం లేకుండా యూత్‌లో తిరుగులేని సొంతం చేసుకున్నారు అగ్ర కథానాయకుడు విజయ్ దేవరకొండ. ఇటీవల ‘కింగ్డమ్’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన ప్రస్తుతం వరుస సినిమాలకు సిద్ధమవుతున్నారు. విజయ్‌దేవరకొండతో అగ్ర నిర్మాత దిల్‌రాజు ‘రౌడీ జనార్ధన్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్న విషయం తెలిసిందే. రవికిరణ్ కోలా దర్శకుడు. రాయలసీమ నేపథ్యంలో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది.
ఈ చిత్రాన్ని దసరా పర్వదినం సందర్భంగా అక్టోబర్ 2న లాంఛనంగా ప్రారంభించి, నవంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెడతారని సమాచారం. కీర్తి సురేష్ కథానాయిక అని తెలుస్తున్నది. ఇదిలావుండగా రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటిస్తున్న పీరియాడిక్ ఎంటర్టైనర్ ఇప్పటికే తొలిషెడ్యూల్ పూర్తి చేసుకుంది. అక్టోబర్‌లో రెండో షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది.