గత రెండేళ్లుగా తెలుగు సినిమాలు బ్రేక్‌నిచ్చింది అగ్ర కథానాయిక కీర్తి సురేష్. ప్రస్తుతం ఈ భామ తమిళ ఇండస్ట్రీపై ఎక్కువగా దృష్టి పెడుతున్నది. తాజాగా ఆమె తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో ఓ భారీ ఆఫర్‌ను దక్కించుకున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. ‘లక్కీ భాస్కర్’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు దర్శకుడు వెంకీ అట్లూరి. త్వరలో ఆయన తమిళ అగ్ర హీరో సూర్యతో ఓ సినిమా చేయబోతున్నారు. మారుతీ కార్లకు సంబంధించిన నేపథ్య కథాంశంతో తెరకెక్కించనున్న బయోపిక్ ఇదని సమాచారం. ‘796 సీసీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని తెలిసింది. ఈ సినిమాలో కథానాయికగా చాలా మంది పేర్లు వినిపించాయి. తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్‌ను ఫైనల్ చేసే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు తెలిసింది. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ భారీ వ్యయంతో తెరకెక్కించనుంది. మే రెండో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుందని సమాచారం.