Keerthy Suresh | సాధారణంగా పెళ్లి అంటే బరాత్ ఉండాల్సిందే. తెలంగాణలో అయితే బరాత్ (baraat dance) చాలా స్పెషల్ అనే చెప్పాలి. బరాత్‌లో బ్యాండ్ మేళం, డప్పు చప్పుళ్ల మధ్య చుట్టాలతోపాటు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు కూడా ఇరగదీసే డ్యాన్స్ చేయడం చూస్తూనే ఉంటాం. చాలా కాలం తర్వాత ఇలాంటి సన్నివేశమే దసరా (Dasara) సినిమాలో చూపించాడు శ్రీకాంత్ ఓదెల. ఈ చిత్రంలో వెన్నెలగా నటించిన కీర్తిసురేశ్ (Keerthy Suresh) పెళ్లి కూతురు గెటప్‌లో బరాత్‌లో చేసే డ్యాన్స్ సినిమాకే మెయిన్ హైలెట్‌గా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
బ్యాండ్ మేళానికి కీర్తిసురేశ్ డ్యాన్స్ చేస్తుంటే థియేటర్లలో ఉన్న ప్రేక్షకులు ఈలలు వేయాల్సిందే. మూవీ లవర్స్ కోసం ఈ బరాత్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. సెలబ్రేషన్స్ ఆఫ్ వెన్నెల టైటిల్‌తో విడుదల చేసిన ఈ వీడియో నెట్టింటిని షేక్ చేస్తోంది. కీర్తిసురేశ్ డ్యాన్స్‌తో సాధారణంగా పెళ్లి వేడుకల్లో భాగంగా జరుపుకునే బరాత్‌లో ఉన్న మజాను మరోసారి అందరికీ పరిచయం చేశాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. ఈ చిత్రంలో కీర్తిసురేశ్ పోషించిన వెన్నెల పాత్రకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.
నాని (Nani) హీరోగా నటించిన దసరా చిత్రంలో సముద్రఖని, సాయికుమార్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో, పూర్ణ, జరీనా వహబ్, కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి కీలక పాత్రల్లో నటించారు. శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణన్ కంపోజ్ చేసిన పాటలకు మంచి స్పందన వస్తోంది. దసరా ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైంది.
సెలబ్రేషన్స్ ఆఫ్ వెన్నెల..
Read Also :
Meera Jasmine | క్వీన్ ఎలిజబెత్‌గా పవన్‌కల్యాణ్ హీరోయిన్.. వివరాలివే
Bhuvana Vijayam | సునీల్ భువన విజయమ్ నుంచి కథన కదనమున లిరికల్ వీడియో సాంగ్
Nayanthara | నయనతార కవల పిల్లల పేర్లేంటో తెలుసా..?