Kayadu Lohar | ‘రిటర్న్ ఆఫ్ది డ్రాగన్’ సినిమాతో యువతరం హృదయాలను బరువెక్కించింది కథానాయిక కయాదు లోహర్. అస్సాంకి చెందిన ఈ వయ్యారి ఇప్పటికే కన్నడ, మలయాళ, మరాఠీ భాషల్లో మెరిసింది. తెలుగులో శ్రీవిష్ణుతో చేసిన ‘అల్లూరి’ చిత్రం కయాదు లోహర్కి అంత కలిసి రాలేదు. అయితే.. తాజా సమాచారం ప్రకారం, ఓ అద్భుతమైన తెలుగు సినిమా అవకాశం ఈ అందాల భామ తలుపు తట్టిందని తెలుస్తున్నది. వివరాల్లోకెళితే.. ‘హిట్ 3’ సక్సెస్తో మంచి జోష్ మీదున్న నాని, త్వరలో ‘ప్యారడైజ్’ సెట్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
‘దసరా’ఫేం శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కథానాయిక ఖరారు కాలేదు. అయితే.. ఇందులో కయాదు లోహర్ కథానాయికగా ఎంపికైందని విశ్వసనీయ సమాచారం. కథలో కథానాయిక పాత్ర కీలకమట. ఆ పాత్రకు కయాదు కరెక్ట్ అని దర్శకుడు శ్రీకాంత్ భావించారట. ఇటీవలే కథ కూడా వినిపించారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సివుంది. ఇదే నిజమైతే.. టాలీవుడ్లో కయాదు లోహర్ టైమ్ మొదలైనట్టే.