Kavya Maran | కావ్య మారన్ పెళ్లి వార్తలు వైరల్.. మ్యూజిక్ డైరెక్టర్‌తో వివాహం అంటూ జోరుగా ప్రచారం
Kavya Maran | సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్‌కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఆమె హావభావాలు, రియాక్షన్స్ తరచూ వైరల్ అవుతూ అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించాయి. అభిమానులు ప్రేమగా "కావ్య పాప" అని పిలుచుకునే ఆమెకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Kavya Maran | సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్‌కు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో ఆమె హావభావాలు, రియాక్షన్స్ తరచూ వైరల్ అవుతూ అభిమానుల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించాయి. అభిమానులు ప్రేమగా “కావ్య పాప” అని పిలుచుకునే ఆమెకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం వినిపిస్తున్న ప్రచారం ప్రకారం, కావ్య మారన్ త్వరలోనే వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్‌తో ఆమె పెళ్లి జరగబోతుందనే వార్తలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ ప్రచారం కొత్తది కాదు. గత ఏడాది నుంచే కావ్య మారన్, అనిరుధ్ మధ్య సాన్నిహిత్యం ఉందంటూ సోషల్ మీడియాలో పుకార్లు వినిపించాయి. ముఖ్యంగా ఇద్దరూ న్యూయార్క్‌లో కలిసి కనిపించారనే వార్తలు రావడంతో డేటింగ్ రూమర్స్ మరింత ఊపందుకున్నాయి. అప్పటి నుంచి వీరిద్దరి గురించి అనేక కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు మరోసారి కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. కొన్ని మీడియా కథనాల ప్రకారం, ఇరువురి కుటుంబ సభ్యులు ఈ వివాహానికి అంగీకారం తెలిపారని, విదేశాల్లో వివాహం జరిపించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయని సమాచారం. వివాహం అనంతరం చెన్నైలో ఘనంగా రిసెప్షన్ నిర్వహించే ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయనే ప్రచారం నడుస్తోంది.
ఇదిలా ఉండగా మరో ఆసక్తికర విషయం కూడా చర్చనీయాంశమైంది. అనిరుధ్‌కు కుటుంబ సంబంధాలు ఉన్న సినీ ప్రముఖులు ఈ వివాహం కోసం ప్రత్యేకంగా చొరవ తీసుకున్నారనే కథనాలు తమిళ మీడియా వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ఈ ప్రచారానికి కారణంగా మరో అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. కావ్య మారన్ కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థలతో అనిరుధ్ వరుసగా పెద్ద సినిమాల్లో పనిచేస్తుండటం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చిందని కొందరు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ తమ కెరీర్లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అనిరుధ్ భారీ పాన్ ఇండియా చిత్రాలకు సంగీతం అందిస్తూ బిజీగా ఉండగా, మరోవైపు కావ్య మారన్ క్రీడా, వ్యాపార వ్యవహారాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఈ వివాహ వార్తలపై అటు కావ్య మారన్ కుటుంబం కానీ, ఇటు అనిరుధ్ వర్గాలు కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఇవి కేవలం సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలేనా? లేక నిజంగానే త్వరలో అధికారిక ప్రకటన వస్తుందా? అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఇండియన్ బిజినెస్ అండ్ ప్రొఫెషనల్ కౌన్సిల్ కువైట్ నూతన కార్యవర్గం బాధ్యతల స్వీకరణ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్.. గుహలోని ఆ భారీ మనిషి ఎవరంటే?
Supreme Court | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్
ఘనంగా రావులపల్లి రాంప్రసాద్ జన్మదిన వేడుకలు
Prabhas | ప్రభాస్ ‘ఫౌజీ’ కొత్త రిలీజ్ డేట్ ఇదేనా..ఇదే నిజమైతే ‘స్పిరిట్’పై ప్రభావం తప్పదా?
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

