ముంబై: అభిమాన హీరో, హీరోయిన్ల సినిమా విడుదల అయ్యిందంటే వారి ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. తమ అభిమాన నటీనటులను ఎవరైనా కామెంట్ చేస్తే ఏకంగా గొడవకే దిగుతారు. అలాంటిది తాము అభిమానించే నటి కళ్ల ముందు కనబడితే ఎలా ఉంటుంది..? సంబరం అంబరాన్ని అంటుతుంది. ఆటోగ్రాఫ్‌లు, సెల్ఫీలు అంటూ హంగామా చేస్తారు. శుక్రవారం ఉదయం ముంబై ఎయిర్‌పోర్టులో అలాంటి దృశ్యమే ఆవిష్కృతమైంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ఇవాళ ఉదయం ముంబై ఎయిర్‌పోర్టులో ఒక్కసారిగా ప్రత్యక్షం కావడంతో అక్కడున్న అభిమానులు మురిసిపోయారు. తమ అభిమాన తారతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అయితే, కత్రినా సిబ్బంది ఆమె అభిమానులను నిరుత్సాహపర్చారు. సెల్ఫీలు దిగుతున్న వాళ్లను పక్కకు తోసేసి ఆమెను ముందుకు తీసుకెళ్లారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో యూట్యూబ్‌లో వైరల్ అవుతున్నది. నెటిజన్ల నుంచి వ్యూస్, కామెంట్స్, లైకులు భారీగా వస్తున్నాయి. ‘మహిళ కావడంతో అభిమానులు ఆమెకు తగిన గౌరవం ఇచ్చారు. ఇబ్బంది పెట్టకుండా దూరం నుంచే సెల్ఫీలు తీసుకున్నారు’ అని ఓ ఇన్‌స్టా యూజర్ కామెంట్ చేశాడు. ఆ వైరల్ వీడియోను కింద మీరు కూడా చూడవచ్చు.