బాలీవుడ్లో సీక్రెట్ వివాహాలు కొత్తేమి కాదు. గతంలో చాలా మంది ఇలానే సైలెంట్‌గా పెళ్లి చేసుకొని షాక్ ఇచ్చారు. బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్, ఆమె ప్రియుడు విక్కీ కౌశల్ త్వరలోనే వివాహ బంధంతో ఓ ఇంటి వారు కాబోతున్నట్లు తెలుస్తోంది. వారి పెళ్లి ఏర్పాట్లకు సంబంధించిన అంశాలు బాలీవుడ్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సస్ ఫోర్ట్ బర్వారాలో వారిద్దరి పెళ్లి వేడుకను ఘనంగా నిర్వహించనున్నట్లు కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి.
గత కొద్ది రోజులుగా పెళ్లికి సంబంధించి జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రొడ్యూసర్ ఆర్తీ శెట్టి నివాసం వద్ద ఈ జంట కంటబడటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. వీరిద్దరు త్వరలో పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అని అంటున్నారు. కాబోయే కోడలికి విక్కీ కౌశల్ తల్లి వీణా కౌశల్ దీపావళి కానుకగా చీర, నగలు పంపినట్టు కూడా తెలుస్తోంది. కత్రీనాకు షాగున్ (ప్రత్యేక బహుమతి) అందిందంటూ ప్రచారం చేస్తున్నారు. తమ వివాహంకి సంబంధించి మరిన్ని లీకులు రాకుండా ఉండేందుకే వెడ్డింగ్ కార్డ్స్ కూడా ఇవ్వట్లేదని అంటున్నారు. ఈ జంట డిసెంబర్ 7 లేదా 9 తేదీల్లో వివాహం చేసుకోనున్నారని భోగట్టా.