Katrina Kaif | సోషల్ మీడియా ప్రభావం పెరిగాక వార్తలు ఎంత వేగంగా వ్యాపిస్తున్నాయో.. అంతకంటే వేగంగా పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రస్తుతం చేతిలో సెల్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ జర్నలిస్టే. అలా అయిపోయింది సొసైటీ. ఈ విషయంపై ఇటీవల కత్రినాకైఫ్ స్పందించింది. ‘లాస్ట్ మంత్ నా భర్త విక్కీ కౌశల్ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకునేందుకు లండన్ వెళ్లాం. అక్కడ కొన్ని ఫొటోలు దిగాం. ఫొటోగ్రాఫర్ తప్పిదం వల్ల ఆ ఫొటోల్లో నేను గర్భం దాల్చినట్టుగా కనిపించాను.
ఇక ఆ ఫొటోలు పట్టుకొని నేను ప్రెగ్నెంట్ అయినట్టుగా వార్తలు రాసేశారు. మేం ఇండియా వస్తున్నామని తెలిసి, నా ఫొటోలకోసం వీరంతా ఎయిర్పోర్ట్ ముందు కెమెరాలతో రెడీగా ఉన్నారు. నేను మామూలుగా రావడంతో అందరూ షాక్ అయ్యారు. వాళ్ల అవస్థ చూస్తే నవ్వొచ్చింది. నా ప్రెగ్నెన్సీ గురించి వాళ్లకెందుకు? అది మా సొంత విషయం కదా.. దానివల్ల దేశానికి ఏమైనా ఉపయోగం ఉందా? వార్తలు ఎలా ఉండాలో తెలియని వాళ్లు వార్తలు రాసేస్తున్నారు. అక్కడే వస్తుంది ప్రాబ్లమ్ అంతా’ అంటూ చెప్పుకొచ్చింది కత్రినా.