Katrina Kaif | ఇండస్ట్రీలో సెలబ్రిటీల జంటలు వివాహం చేసుకున్న తర్వాత పిల్లల విషయాన్నికొంత సస్పెన్స్‌గా ఉంచుతారు. అయితే వివాహం తర్వాత కొన్ని సంవత్సరాలు ఆగి పిల్లలు ప్లాన్ చేసుకునేవారూ కొందరైతే, మరోవైపు ఏళ్లు గడుస్తున్నా ప్లాన్ చేయని జంటలు కొన్ని . దీపికా పదుకోనే, రామ్ చరణ్ వంటి సెలబ్రిటీలు పెళ్లయిన చాలా ఏళ్ల తర్వాత తల్లిదండ్రులు కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదే దారిలో ఇప్పుడు కత్రినా కైఫ్ కూడా ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి. వివాహం జరిగి నాలుగు సంవత్సరాలు అయినా పిల్లలు ఇంకా పిల్లల గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వడంతో అభిమానుల్లో నిరుత్సాహం నెలకొంది.
గత కొన్ని రోజులుగా కత్రినా కైఫ్ కొత్త సినిమా ప్రాజెక్టు ప్రకటించకపోవడంతో ఆమె ప్రెగ్నెంట్ అయిందని, ఈ ఏడాది చివరలో తల్లి కానున్నారనే వార్తలు నెట్టింట తెగ హల్చల్ చేస్తుననాయి. కానీ ఇప్పటివరకు దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు. అయితే రీసెంట్గా కత్రినా మెరూన్ రెడ్ గౌనులో ఫోటోలకు ఫోజులివ్వగా ఆమె బేబీ బంప్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది మెటర్నిటీ ఫోటోషూటా, లేక సినిమా షూటింగ్ లో భాగమా అనే విషయంలో స్పష్టత లేదు. అయినా, ఈ ఫోటో చూసి అభిమానులు చాలా సంతోషిస్తూ “అభినందనలు” అంటూ పొస్ట్ చేస్తున్నారు.
కత్రినా కైఫ్-విక్కీ కౌశల్ విషయానికి వస్తే, వీరు 2019లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత 2021 డిసెంబర్ 9న రాజస్థాన్ దగ్గర సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ ఫర్ట్ లో వారి వివాహం జరిగింది. పెళ్లైప్పటి నుండి ఈ జంట ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారు. విక్కీ కౌశల్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నా, కత్రినా కైఫ్ మాత్రం సినిమాలు చేయకుండా సైలెంట్‌గా ఉంది. ఆమె ప్రగ్నెన్సీ విషయంలో ఎలాంటి క్లారిటీ రావడం లేదు. కాగా, విక్కీ ఇటీవల “ఛావా” చిత్రంతో పెద్ద విజయం సాధించి భారీ కలెక్షన్లు సాధించారు. ప్రస్తుతం “లవ్ అండ్ వార్” వంటి ప్రాజెక్టులో భాగంగా నటిస్తున్నారు.