వినోదంతో కూడిన పల్లెటూరి నేపథ్య చిత్రం ‘కన్యాకుమారి’. గీత్ సైని, శ్రీచరణ్ రాచకొండ జంటగా నటించిన చిత్రాన్ని దామోదర స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ సినిమాలోని లిరికల్ సాంగ్‌ని విడుదల చేశారు. ‘కత్తిల్లాంటి పిల్లవే..’ అంటూ సాగే ఈ గీతాన్ని దామోదర్ సృజన్ రాయగా, రవి నిడమర్తి స్వరపరిచారు. ధనుంజయ్ ఆలపించారు.
‘కొట్టావే పిల్లా.. నువ్వు మనసుని కొల్లగొట్టావే.. చేశావే పిల్లా నువ్వు గుండెను గుల్ల చేశావే.. వయ్యారాల సొగసుతోటి.. చిన్నదాన సొగసుతోటి.. గుండెల్లోన గుద్దావే.. నా చిట్టి గుండెనెక్కి తొక్కేశావే.. కత్తిలాంటి పిల్లవే కన్యాకుమారి..’ అంటూ గమ్మత్తైన సాహిత్యంతో ఈ పాట సాగింది. త్వరలో విడుదల కానున్న ఈ సినిమాకి కెమెరా: శివ గాజుల, హరిచరణ్.కె, సంగీతం: రవి నిడమర్తి.