Ilaiyaraaja | ఇళయరాజాపై సెటైర్లు.. క్షమాపణలు చెప్పిన సూర్య ‘కరుప్పు’ టీమ్!
Ilaiyaraaja | ప్రముఖ సంగీత దర్శకుడు, 'మ్యాస్ట్రో' ఇళయరాజాకు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్ర బృందం బహిరంగ క్షమాపణలు చెప్పింది.
Karuppu Team | ప్రముఖ సంగీత దర్శకుడు, ‘మ్యాస్ట్రో’ ఇళయరాజాకు సూర్య ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) చిత్ర బృందం బహిరంగ క్షమాపణలు చెప్పింది. నటుడు, దర్శకుడు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే, ఈ సినిమాలో వచ్చే ఒక సీన్లో బ్యాక్‌గ్రౌండ్‌లో విజయ్‌కాంత్ సినిమా పాట వినిపిస్తున్న సమయంలో, పాటల ‘కాపీరైట్’ వివాదాలపై వచ్చే కొన్ని సంభాషణలు పరోక్షంగా ఇళయరాజాను కించపరిచేలా మరియు వ్యంగ్యంగా ఉన్నాయంటూ ఆయన అభిమానులు, సినీ విశ్లేషకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో తన అనుమతి లేకుండా పాటలు వాడుకుంటే ఇళయరాజా లీగల్ నోటీసులు ఇస్తున్న నేపథ్యంలో, సినిమాలో పెట్టిన ఈ సెటైర్లు ఆయన మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడిచింది.
ఈ వివాదం ముదరడంతో తక్షణమే స్పందించిన చిత్ర నిర్మాణ సంస్థ ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ సోషల్ మీడియా ద్వారా ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, ఇళయరాజా గారిపై తమకు ఎంతో గౌరవం ఉందని, భారతీయ సినీ రంగానికి ఆయన చేసిన సేవలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకమని పేర్కొంది. ఆయన్ను అగౌరవపరచడం లేదా కించపరచడం తమ ఉద్దేశం కాదని, కేవలం ఒక సాధారణ హాస్య సందర్భంలో భాగంగా మాత్రమే ఆ డైలాగ్స్ వచ్చాయని, అవి ఎవరినీ వ్యక్తిగతంగా ఉద్దేశించి చేసినవి కావని స్పష్టం చేసింది. అయినప్పటికీ ఆయనపై ఉన్న గౌరవంతో ఈ చిత్రంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇళయరాజా గారిని ఉద్దేశిస్తూ ఉన్న ఆ సంభాషణలను, వివాదాస్పద సీన్‌ను సినిమా తదుపరి ప్రదర్శనల నుండి పూర్తిగా తొలగిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’తో ఆల్‌టైమ్ రికార్డులు గ్యారెంటీ.. విడుదలకు ముందే థమన్ భారీ హైప్!
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

