RJ Balaji | ‘కరుప్పు’ బ్లాక్ బస్టర్.. సీఎం విజయ్ను కలిసిన దర్శకుడు ఆర్జే బాలాజీ
RJ Balaji | ‘కరుప్పు’ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఈ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు.
RJ Balaji | ‘కరుప్పు’ సినిమా బ్లాక్ బస్టర్ అందుకోవడంతో ఈ చిత్ర దర్శకుడు ఆర్జే బాలాజీ.. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నాడు. ఈ సందర్భంగా తన ‘కరుప్పు’ కథను మొదట విన్నందుకు సీఎం విజయ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విజయ్ను ముఖ్యమంత్రి హోదాలో కలవడం తనకు ఒక కలలా అనిపిస్తోందని, ఆయనలో ఇప్పటికీ అదే ప్రేమ, ఆప్యాయత, ప్రశాంతత కనిపిస్తున్నాయని బాలాజీ ఎక్స్‌లో రాసుకొచ్చారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఇప్పటికే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకుపోతుంది. సూర్య, త్రిష ప్రధాన పాత్రల్లో నటించారు.
నిజానికి ‘కరుప్పు’ సినిమా కథను ఆర్జే బాలాజీ మొదట విజయ్ కోసమే సిద్ధం చేశారు. విజయ్ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో రాకముందు, ఆయన చివరి చిత్రంగా దీనిని తెరకెక్కించాలని భావించి కథను కూడా వినిపించారు. అయితే, ఆ సమయంలో పలు సమీకరణాలు, రాజకీయ ప్రవేశం వంటి కారణాల వల్ల విజయ్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఆయన ఈ సినిమా చేయనప్పటికీ, స్క్రిప్ట్ చర్చల సమయంలో విజయ్ అడిగిన ప్రశ్నలు, ఇచ్చిన సలహాలు కథను మరింత మెరుగుపరచడానికి ఎంతో ఉపయోగపడ్డాయని బాలాజీ గతంలో వెల్లడించారు. అందుకే ఈ సినిమా ప్రారంభ క్రెడిట్స్‌లో విజయ్‌కు ధన్యవాదాలు కూడా తెలిపారు. విజయ్ నో చెప్పిన తర్వాతే ఈ స్క్రిప్ట్ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ద్వారా హీరో సూర్య వద్దకు వెళ్ళింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

