Bhool Bhulaiyaa teaser | ‘లుకాచుప్పి’, ‘పతీ పత్నీ ఔర్ వో’, ‘ధమాకా’ వంటి సినిమాలతో బాలీవుడ్లో మంచి నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ ఆర్యన్. ఈయన నటించిన లేటెస్ట్ చిత్రం ‘భూల్ భూలైయా-2’. 2007లో అక్షయ్ కుమార్, విద్యా బాలన్, అమీషా పటేల్ నటించిన ‘భూల్ భూలైయా’ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. అప్పట్లో ఈ చిత్రం హిందీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్టయిన మణిచిత్రతాఝుకు రీమేక్‌గా తెరకెక్కింది. దాదాపు 15 ఏళ్ళ తర్వాత భుల్ భులైయా సీక్వెల్ తెరకెక్కింది.
మొదటి నుంచి ఈ చిత్రంపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. యాభై నాలుగు సెకన్ల నిడివి గల టీజర్ అత్యంత భయంకరంగా ఉంది. ప్రీతమ్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. కియారా అద్వానీ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో టబు, రాజ్‌పాల్ యాదవ్, పరేశ్ రావల్ కీలకపాత్రలో నటించనున్నారు. ‘టీ-సిరీస్’, ‘సినీ1 స్టూడీయోస్’ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. కామెడీ హార్రర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రం గతేడాది జులైలోనే విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడింది. తిరిగి మార్చి 25న చిత్రం విడుదల కానున్నట్లు ప్రకటించారు. కానీ అదే రోజున ఆర్ఆర్ఆర్ విడుదల కావడంతో పోటీ నుంచి తప్పుకున్నారు.