శుక్రవారం 03 జూలై 2020
Cinema - Mar 20, 2020 , 11:48:23

పొల్లాచ్చి కేసు తీర్పుకి ఇంకెన్నేళ్ళు ప‌డుతుందో : కార్తీ

పొల్లాచ్చి కేసు తీర్పుకి ఇంకెన్నేళ్ళు ప‌డుతుందో :  కార్తీ

దాదాపు ఏడున్న‌రేళ్ళ త‌ర్వాత నిర్భ‌య దోషుల‌కి ఉరిశిక్ష ప‌డింది. దీనిపై కొంద‌రు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్న‌ప్ప‌టికీ, మ‌రికొంద‌రు విచారం వ్య‌క్తం చేస్తున్నారు. బాధితురాలిని అంత నీచంగా రేప్ చేసిన దోషుల‌ని  శిక్షించ‌డానికి ఇంత స‌మ‌యం తీసుకోవ‌డం ఎంత వ‌ర‌కు కరెక్ట్‌. చ‌ట్టంలో  ప‌లు మార్పులు  త‌ప్ప‌క తీసుకురావాలి ప‌లువురు ప్ర‌ముఖులు త‌మ వాద‌న‌లు గ‌ట్టిగా వినిపిస్తున్నారు. 

తాజాగా త‌మిళ న‌టుడు కార్తీ.. నిర్భ‌య ఘట‌న‌కి సంబంధించిన తీర్పుపై త‌న ట్విట్ట‌ర్ ద్వారా స్పందించాడు. 8 సంవ‌త్స‌రాల త‌ర్వాత న్యాయం జ‌రిగింది. పొల్లాచి కేసులో న్యాయం జరగడానికి ఎంత సమయం పడుతుందో అని ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికే ఒక సంవత్సరం అయ్యింది. ఈ ఘ‌ట‌న నుండి మ‌నం చాలా నేర్చుకోవ‌ల‌సి ఉంది. ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి అని కార్తీ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.

గ‌త ఏడాది పొల్లాచ్చికి చెందిన 16ఏళ్ల బాలికపై అత్యాచారం జ‌రిగిన విష‌యం తెలిసిందే .  సాయంత్రం స‌మ‌యంలో తన చెల్లెలితో కలిసి దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండ‌గా,  బైక్‌పై వచ్చిన ఓ యువకుడు వారిని అడ్డగించాడు. బాలికను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని వెళ్లిపోయాడు. ఊహించని సంఘటనతో షాక్‌కు గురైన బాలిక చెల్లెలు కాసేపటికి తేరుకుని ఇంటికెళ్లి అక్క కిడ్నాప్ విషయం చెప్పింది. వారు వెంటనే పొల్లాచ్చి వెస్ట్ పోలీసులను ఆశ్రయించారు. అయితే పదహారేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన పది మంది కామాంధులు ఆమెపై గ్యాంగ్ రేప్ చేశారు. రెండు రోజుల పాటు అమ్మాయికి నరకం చూపించిన వారిని కోయంబత్తూరు సెంట్రల్ జైలుకు తరలించారు. logo