Annagaru Vostaru | కోలీవుడ్ నటుడు కార్తి నటించిన తాజా చిత్రం ‘అన్నగారు వస్తారు’. ఈసినిమాకు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహిస్తుండగా.. కార్తి సరసన యువనటి కృతి శెట్టి సందడి చేయనుంది. ఈ చిత్రం డిసెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి తెలుగు ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు హరీష్ శంకర్ విడుదల చేశారు. ట్రైలర్ చూస్తుంటే.. ఇది పూర్తిస్థాయి యాక్షన్-కామెడీ కథాంశంతో రూపొందించబడిందని తెలుస్తుంది. ఇందులో కార్తి ఓ సరదా, చలాకీ స్వభావం గల పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ట్రైలర్లో కార్తి పాత తరం నటుడు, దివంగత ముఖ్యమంత్రి సీనియర్ ఎన్టీఆర్ వీరాభిమానిగా కనిపించడం, ఆయన తరహా గెటప్‌లో కొన్ని సన్నివేశాలు ఉండటం అభిమానులను విశేషంగా ఆకర్షించింది.