కార్తి కథానాయకుడిగా నటించిన తమిళ చిత్రం ‘వా వాథియార్’.. ‘అన్నగారు వస్తారు’ పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మించారు. శనివారం ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు హరీశ్‌శంకర్ విడుదల చేశారు. ఇందులో మంచి సెన్సాఫ్ హ్యూమర్ కలిగిన పోలీసాఫీసర్‌గా కార్తి కనిపించారు.
సరదాగా జీవితాన్ని గడిపే హీరో అన్నగారిలా ఎంట్రీ ఇచ్చి సమాజం కోసం ఏం చేశాడన్నది ట్రైలర్లో ఆసక్తికరంగా అనిపించింది. కామెడీ, యాక్షన్, రొమాన్స్ కలబోసిన పాత్రలో కార్తి నటన ప్రత్యేకాకర్షణగా నిలిచింది. అన్ని కమర్షియల్ అంశాలు మేళవించిన మాస్ ఎంటర్టైనర్ ఇదని మేకర్స్ తెలిపారు. కృతిశెట్టి, సత్యరాజ్, మధుర్ మిట్టల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణన్, రచన-దర్శకత్వం: నలన్ కుమారస్వామి.