‘బిగ్బాస్’ఫేం అర్చన, మితాలి చౌహాన్, వినోద్ అల్వా, కాలకేయ ప్రభాకర్, బలగం సంజయ్, నాగమహేశ్, దిల్ రమేశ్, చిత్రం శ్రీను ముఖ్య పాత్రలు పోషిస్తున్న చిత్రం ‘కర్మస్థలం’. రాకీ షెర్మన్ దర్శకుడు. శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం నిర్మాత. త్వరలోనే పాన్ఇండియా రేంజ్లో సినిమా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా మోషన్ పోస్టర్ని హైదరాబాద్లో హీరో పూరీ ఆకాష్ చేతుల మీదుగా విడుదలచేశారు.
ఈ సందర్భంగా పూరీ ఆకాష్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘మనం చేసుకునే పండుగల వెనుక ఓ హిస్టరీనో, ఓ యుద్ధమో ఉండితీరుతుంది. అలాంటి ఓ యుద్ధం గురించి ఈ సినిమాలో చెప్పాను. ఆ యుద్ధమే మహిషాసుర మర్ధని. ఈ కథను నేను ఎంత పవిత్రంగా నమ్మానో అంతే పవిత్రంగా ఈ సినిమా తీశాను.’ అని దర్శకుడు రాకీ షెర్మన్ అన్నారు. సనాతన ధర్మం గురించి చెప్పే సినిమా ఇదని, రాకీ అద్భుతంగా తీశాడని నిర్మాత తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.