చండీఘఢ్ : పటౌడీ ప్యాలెస్‌లో క్రిస్మస్ హాలిడేస్‌ను భర్త సైఫ్ అలీఖాన్‌తో కలిసి ఎంజాయ్ చేస్తున్న కరీనా కపూర్ ఫొటోలు (Viral Pics) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతున్నాయి. భర్తతో కలిసి హాలిడేస్‌ను ఆస్వాదిస్తున్న ఫొటోలు ఫెస్టివ్ సీజన్‌ను ఆమె గడుపుతున్న తీరును కండ్లకు కడుతున్నాయి.
భర్తతో వెకేషన్‌ను ఎంజాయ్ చేయడంతో పాటు నోరూరించే వంటకాలను ఆస్వాదించే ఫొటోలను కరీనా కపూర్ ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో బాలీవుడ్ హాట్ కపుల్ విశాలవంతమైన లాన్లో విహరించడం కనిపిస్తుంది.
ఓ ఫొటోలో సైఫ్ మొక్కజొన్న రోటీని టేస్ట్ చేయడం చూడొచ్చు. మరికొన్ని ఫొటోల్లో డెజర్ట్స్, తాజా కూరగాయలు కనిపించగా మేకప్ లేకుండా కరీనా కనిపిస్తుంది.
Read More :