కరీనాకపూర్, పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా నటిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘డాయ్రా’. మేఘనా గుల్జార్ దర్శకురాలు. ఈ నెల 31న ట్రైలర్ను విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా బుధవారం స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. యథార్థ సంఘటనల స్ఫూర్తితో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
భిన్న ధృవాల్లాంటి ఇద్దరు పోలీస్ ఆఫీసర్స్ ఓ కేసు పరిశోధనలో ఎదుర్కొన్న సవాళ్లు, నేరాన్ని వారిద్దరు చూసే దృష్టికోణం నేపథ్యంలో కథ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుందని, ఎమోషనల్ క్రైమ్ డ్రామాగా ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. జంగ్లీ పిక్చర్స్, డాక్టర్ జయంతిలాల్ గాడా పెన్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.