MS Dhoni | టీమిండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని క్రికెట్లో కింగ్ అన్న విషయం తెలిసిందే. క్రికెట్‌తో ధోని బాగానే సంపాదించారు. అయితే ఆయన క్రికెట్‌తో పాటు ఎక్కువ బ్రాండ్లకు ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. ఏడాది పొడవునా సినిమాలు, టీవీ కార్యక్రమాలతో ప్రజల్లోనే ఉండే సెలబ్రిటీలకన్నా రెండు నెలల పాటు ఐపీఎల్ మ్యాచ్ లు ఆడే ధోనీతోనే తమ బ్రాండ్స్‌కి ప్రచారం చేయించుకోవాలని కొన్ని కంపెనీలు భావిస్తున్నాయంటే ధోని క్రేజ్ ఏంటో మనకు అర్ధమవుతుంది. ఐదేళ్ల కిందటే అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ధోనీ 2024 సంవత్సరం తొలి అర్ధభాగంలో ఎన్నో యాడ్స్ చేశాడు.
అయితే ధోని తర్వాత సినిమాలని నిర్మించడం కూడా మొదలు పెట్టాడు. ఇప్పుడు ధోని నటుడిగా మారబోతున్నాడా అనే డౌట్ వస్తుంది. తాజాగా బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్ ఓ వీడియోని షేర్ చేయగా, ఇందులో ధోని నటించబోతున్నాడు, ఓ కొత్త రొమాంటిక్ అవతారంలో కనపడనున్నట్టు అర్ధమవుతుంది. వీడియోలో ధోని హార్ట్ సింబల్ బెలూన్ పట్టుకొని కనపడ్డాడు. ఆ వీడియో చూసిన తర్వాత ధోని హీరోగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడా అనే అనుమానాలు అందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక కరణ్ జోహార్ ఈ వీడియో షేర్ చేయడంతో కరణ్ జోహార్ .. ధోనిని పరిచయం చేయనున్నాడా అనే అనుమానాలు కొందరిలో కలుగుతున్నాయి.
అయితే ఈ వీడియోకి గల్ఫ్ ఆయిల్ కంపెనీని ట్యాగ్ చేయడంతో ఈ వీడియో ఒక యాడ్ కోసం ఏమో, ఆ యాడ్ ని కరణ్ జోహార్ డైరెక్ట్ చేసాడేమో అని కొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి ధోనికి సంబంధించి వీడియో ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్పెషల్ వీడియో ధోని యాడ్ కోసమా? బాలీవుడ్ ఎంట్రీ కోసమా అని తెగ ముచ్చటిస్తున్నారు. కాగా, ధోని ఇప్పుడు సీఎస్కేకి కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ఐదు మ్యాచ్‌ల పరాజయాల తరువాత లక్నో సూపర్ జెయింట్స్‌పై వచ్చిన ఈ గెలుపు ధోనీ అద్భుత ప్రదర్శన కారణంగా సాధ్యమైంది. ధోనీ కేవలం 11 బంతుల్లో 26 పరుగులు చేసి మ్యాచ్‌ను చక్కదిద్దాడు. శివమ్ దూబేతో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో గత రాత్రి జరిగిన మ్యాచ్‌లో చెన్నై విజయం సాధించింది.