Kanthara Chapter 1 | అఫీషియల్ అనౌన్స్మెంట్.. కాంతార చాప్టర్ 1 ఓటీటీ విడుదల తేది ఇదే..!
Kanthara Chapter 1 | భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కాంతార: చాప్టర్-1’ దూకుడు కొనసాగిస్తుంది. విడుదలైన మూడు వారాల వ్యవధిలోనే ఈ చిత్రం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది.
Kanthara Chapter 1 | భారీ అంచనాల నడుమ విడుదలైన ‘కాంతార: చాప్టర్-1’ దూకుడు కొనసాగిస్తుంది. విడుదలైన మూడు వారాల వ్యవధిలోనే ఈ చిత్రం 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన బాలీవుడ్ చిత్రం ‘ఛావా’ రూ.807 కోట్లు వసూలు చేసి టాప్ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత వచ్చిన ‘సైయారా’ రూ.600 కోట్ల వద్ద ఆగిపోయింది. భారీ హైప్ ఉన్న ‘కూలీ’ కూడా ఆ రికార్డును దాటలేకపోయింది. అయితే రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన ‘కాంతార: చాప్టర్-1’ మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసి, ఈ రికార్డును చెరిపేసింది.
తాజా లెక్కల ప్రకారం, ఈ చిత్రం 22వ రోజుకే రూ.818 కోట్ల వరల్డ్‌వైడ్ కలెక్షన్ సాధించింది. దీంతో ‘కాంతార: చాప్టర్-1’ ఈ ఏడాది హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అయితే వసూళ్లు ఇక్కడితోనే ఆగిపోయే అవకాశం ఉందని ట్రేడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. మొదట వెయ్యి కోట్ల మార్క్ చేరుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఆ లక్ష్యం సాధ్యం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఓవర్సీస్లో మాత్రం సినిమా పెద్దగా రాణించలేదు. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఇది లాస్ వెంచర్‌గా నిలిచింది. అక్కడ 7 మిలియన్ డాలర్లు వసూలు చేస్తేనే బ్రేక్ఈవెన్ అయ్యేది. కానీ సినిమా కేవలం 5 మిలియన్ డాలర్ల వద్ద ఆగిపోయింది. ప్రీమియర్స్ సమయంలో పెద్దగా స్పందన రాకపోవడం, ఓపెనింగ్స్ తక్కువగా ఉండటంతో వసూళ్లపై ఎఫెక్ట్ పడంది.
ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్కు ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియో తాజాగా క్లారిటీ ఇచ్చేసింది. ఈ ప్రెస్టీజియస్ చిత్రాన్ని అక్టోబర్ 31 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు కొద్ది సేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు.థియేటర్స్‌లో రచ్చ లేపిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందా అని ప్రతి ఒక్కరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించగా జయరామ్, గుల్షన్ దేవయ్య, ప్రమోద్ శెట్టి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందించగా, హొంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేశారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

