Kantara | కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి లీడ్ రోల్లో తెరకెక్కి తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో బాక్సాఫీస్‌ను షేక్ చేయడమే కాకుండా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో చూపించిన చిత్రం కాంతార. ఈ సినిమాతో హీరో కమ్ డైరెక్టర్‌గా పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్నాడు రిషబ్ శెట్టి. ఇప్పుడు మరోసారి ప్రీక్వెల్ కాంతార చాప్టర్-1తో హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాడు.
కాంతార చాప్టర్-1 కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. విడుదలైన అన్ని భాషల్లో మంచి వసూళ్లు రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో మూడేళ్ల కింద విడుదలైన కాంతార డిజిటల్ ప్లాట్‌ఫాంలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఇండియాలో నెట్‌ఫ్లిక్స్ లో కాంతార హిందీ వెర్షన్ 4వ స్థానంలో ట్రెండింగ్ అవుతుంది.
కాంతార చాప్టర్ 1 విడుదలైన రోజునుంచి బాక్సాఫీస్ వద్ద చూపిస్తున్న పర్ఫార్మెన్స్ వల్లే కాంతార ట్రెండింగ్‌లో నిలుస్తుండటం విశేషం. కాంతార చాప్టర్ 1 వరల్డ్ వైడ్‌గా ఇప్పటివరకు రూ.250 కోట్లు గ్రాస్ రాబట్టింది. పాపులర్ డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో కాంతార చాప్టర్ 1 డిజిటల్ రైట్స్ భారీ మొత్తానికి దక్కించుకుంది.
అక్టోబర్ 2న దసరా పండుగ సందర్భంగా విడుదలైన ‘కాంతార చాప్టర్ 1’ బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయం సాధిస్తూ విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ. 300 కోట్ల క్లబ్‌లోకి చేరింది. హోంబలే ఫిలింస్ నిర్మాణంలో రూపొందిన ఈ మూవీ 7 భాషల్లో, దాదాపు 7000 థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే రూ. 235 కోట్లు వసూళ్లతో దూసుకెళ్తోంది.
Kayadu Lohar | ఆ సినిమాకు నా హృదయంలో ప్రత్యేక స్థానం.. తెలుగు మూవీపై కయాదు లోహర్