Rishab Shetty : కాంతార సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఈ సినిమాలో అతని నటనకు సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు. అంతేకాదు ఈ మూవీకి దర్శకుడిగా మంచి మార్కులు కొట్టేశాడు. కాంతార సినిమాలో సంప్రదాయ దుస్తులు వేసుకున్న వేషధారిని పంజుర్లి దేవుడు ఆవహించిన సన్నివేశాలు హైలెట్ అని చెప్పాలి. అయితే, కొందరు ఈమధ్య సోషల్‌మీడియాలో కాంతార సీన్స్‌ను రీల్స్ చేయడం గమనించిన రిషబ్ శెట్టి వీడియో స్టేట్మెంట్ ద్వారా అందరికీ ఒక రిక్వెస్ట్ చేశాడు. ‘సినిమాలోని దేవుడి పాత్రను అనుకరించకండి. అలాంటి పనులు చేస్తే మా మనోభావాలు దెబ్బతింటాయి’ అని రిషబ్ శెట్టి అన్నాడు. ఈ సినిమాను నిర్మించిన హొంబలే సంస్థ కూడా రిషబ్ శెట్టి మాట్లాడుతున్న వీడియోను శుక్రవారం రిలీజ్ చేసింది.
‘సినిమా విడుదల అయినప్పుడు కూడా నేను రిక్వెస్ట్ చేశాను. ఇప్పుడు మళ్లీ రిక్వెస్ట్ చేస్తున్నాను. స్టేజ్‌ల మీద దేవుడిని అనుకరించకండి. రీల్స్ చేయకండి. ఆ సంప్రదాయాలను పాటించేవాళ్ల మనసు నొచ్చుకుంటుంది’ అని రిషభ్ శెట్టి తెలిపాడు. హిందీలోనూ కాంతార సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా రాబట్టింది.
ದೈವದ ಆಶೀರ್ವಾದ, ಅಭಿಮಾನಿಗಳ ಹಾರೈಕೆಯಿಂದ ಅಭೂತಪೂರ್ವ ಯಶಸ್ಸು ಕಂಡಿರುವ ದಂತಕಥೆ, ಕಾಂತಾರದ ತುಳು ಅವತರಣಿಕೆ ಡಿಸೆಂಬರ್ 02, 2022ರಂದು ನಿಮ್ಮ ಹತ್ತಿರದ ಚಿತ್ರಮಂದಿರಗಳಲ್ಲಿ ಬಿಡುಗಡೆಯಾಗಲಿದೆ.
ತುಳುನಾಡ ಆಚರಣೆ, ನಂಬಿಕೆಗೆ ಧಕ್ಕೆ ಬಾರದಂತೆ ಈ ಸಿನಿಮಾವನ್ನು ಮಾಡಿದ್ದೇವೆ. ನಿಮ್ಮೆಲ್ಲರ ಬೆಂಬಲಕ್ಕೆ ಹೊಂಬಾಳೆ ಚಿತ್ರತಂಡ ಆಭಾರಿಯಾಗಿದೆ. pic.twitter.com/Gtl4RZjI9I
— Hombale Films (@hombalefilms) December 1, 2022