Kantara Chapter 1 | సూపర్ హిట్ కాంతార సినిమాకు ప్రీక్వెల్‌గా రూపొందిన ‘కాంతార చాప్టర్ 1’ చిత్రం మరి కొద్ది గంటలలో థియేటర్స్‌లోకి రానుంది. హోంబలే ఫిలింస్ పతాకంపై విజయ్ కిరగందూర్ నిర్మాణంలో, రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా భారీ హిట్ కొడుతుందనే ఆశాభావంతో మేకర్స్ ఉన్నారు. కాంతార చాప్టర్ 1’ కు 169 నిమిషాల నిడివి (2 గంటలు 49 నిమిషాలు)గా సీబీఎఫ్సీ అనుమతి ఇచ్చింది. ఇది ఇటీవల కాలంలో వచ్చిన అధిక నిడివి కలిగిన కన్నడ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ సినిమా కర్ణాటకలోని కదంబ వంశానికి చెందిన 4వ శతాబ్దం కాలపు పౌరాణిక నేపథ్యంతో సాగుతుంది.
ఓ యువరాణి (రుక్మిణి వసంత్)కు గ్రామ యువకుడితో ఉండే ప్రేమ, భక్తి, మానవతా విలువల మేళవింపుతో రాసిన కథను దర్శకుడు రిషబ్ శెట్టి అత్యంత క్లాసికల్ టచ్‌తో రూపొందించినట్టు తెలుస్తోంది.ఈ కథలో దైవ, భక్తి, మూడ నమ్మకాలు, సంస్కృతులు, రాచరిక వ్యవస్థలపై సున్నితంగా స్పందించే అంశాలు ప్రధానంగా ఉంటాయని బోర్డు తెలిపింది. జయరాం, గుల్షన్ దేవయ్య, రాకేష్ పూజారి కీలక పాత్రలు పోషిస్తున్నారు. చిత్రానికి కెమెరామెన్ గా అరవింద్ కశ్యప్, ఎడిటింగ్ కేఎం ప్రకాశ్, శోభిత్ శెట్టి, సంగీతం అజనీష్ లోక్‌నాథ్ అందించారు. ‘కాంతార’ మొదటి భాగం సాధించిన ఘన విజయం నేపథ్యంలో, ఈ ప్రీక్వెల్పై బిజినెస్ వర్గాలు, సినీ ప్రేక్షకులు, క్రిటిక్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ముఖ్యంగా మ్యూజిక్, విజువల్స్, కథన శైలి, పాత్రల పరిణతి విషయంలో ‘కాంతార చాప్టర్ 1’ వినూత్న అనుభూతిని కలిగించబోతోందని సెన్సార్ సభ్యుల అభిప్రాయం. ఈ సినిమా ఇతిహాసం, మైతాలజీ, మానవ భావోద్వేగాల మేళవింపుగా రూపొందిందని, అందుకే దీని నిడివి ఎక్కువగా ఉండటాన్ని చిత్ర బృందం జస్టిఫై చేస్తోంది. తొలి భాగం కన్నా కథ పరంగా, నిర్మాణ విలువల పరంగా, సాంకేతికంగా మరింత గొప్ప స్థాయిలో రూపొందింది ఈ చిత్రం. తాజాగా మూవీ నుండి రెబల్ ట్రాక్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటలోని లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఆది నుండి నింగి, నెల ఉన్నాయంట ఈడే అంటూ సాగే ఈ పాటని కృష్ణకాంత్ రాయగా, తెలుగులో కాల భైరవ పాడారు.హిందీలో దిల్జిత్ దోసాంజ్ పాడారు. మీరు ఈ పాట విని ఎంజాయ్ చేయండి.