Kantara 2 |దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కన్నడ చిత్రం ‘కాంతారా: చాప్టర్ 1’ సినిమా ఇప్పుడు బాక్సాఫీసు వద్ద కొత్త చరిత్ర సృష్టిస్తోంది. దర్శకుడు, హీరోగా రిషబ్ శెట్టి రూపొందించిన ఈ సినిమా థియేటర్లలో ఘన విజయం సాధించి సూపర్‌హిట్ టాక్ సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ‘కాంతారా: చాప్టర్ 1’ ఈ ఏడాది భారతీయ సినిమాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటి వరకు రూ. 828 కోట్ల పైగా కలెక్షన్లు రాబట్టింది. కన్నడ భాషలో విడుదలైన ఈ సినిమా, కంటెంట్ పరంగా మాత్రమే కాకుండా కమర్షియల్ పరంగానూ రికార్డులను తిరగరాస్తోంది.
స్థానికంగా కూడా ఈ సినిమా ఘనత సాధించింది. రూ. 250 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టిన తొలి కన్నడ చిత్రంగా నిలిచింది. మంచి కథ, అద్భుతమైన విజువల్స్, భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం దక్షిణ రాష్ట్రాల్లోనే కాకుండా, మహారాష్ట్రలో కూడా ఈ సినిమా ప్రభంజనం సృష్టిస్తోంది. గతంలో ‘పుష్ప 2: ది రూల్’ రూ. 256 కోట్ల గ్రాస్ సాధించగా, ఇప్పుడు ‘కాంతారా: చాప్టర్ 1’ ఆ రికార్డును బ్రేక్ చేసి కొత్త మైలురాయిని నెలకొల్పింది. Hombale Films నిర్మించిన ఈ చిత్రంలో యువ నటి రుక్మిణి వసంత్ కీలక పాత్రలో నటించి ఆకట్టుకున్నారు. సంగీతాన్ని అజనీష్ లోకనాథ్ అందించగా, ఆయన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మరింత బలాన్ని ఇచ్చింది. సినిమాకి వస్తున్న పాజిటివ్ టాక్ వల్ల ప్రేక్షకులు థియేటర్లకు భారీగా తరలివస్తున్నారు.
కథ, డైలాగులు, సంగీతం, విజువల్స్ అన్నీ కలగలిసి ఈ సినిమాను ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం కల్పించాయి. ప్రస్తుతం ఈ సినిమా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషల్లో కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మొత్తానికి, రిషబ్ శెట్టి సృష్టించిన ఈ “కాంతారా ఫినామినన్” దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. రోజురోజుకు వసూళ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా భారతీయ సినిమా చరిత్రలో సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.