North America | పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేసిన “కాంతార” సినిమాకు ప్రీక్వెల్‌గా వచ్చిన “కాంతార చాప్టర్ 1” మరోసారి ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకుంటోంది. రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా తనదైన శైలిలో తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పుడు వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద “కాంతార చాప్టర్ 1” సత్తా చాటింది. $3 మిలియన్ గ్రాస్ (దాదాపు ₹25 కోట్లకు పైగా) వసూలు చేసి, స్ట్రాంగ్ హోల్డ్‌తో దూసుకెళ్తోంది. పలు ప్రాంతాల్లో వసూళ్లలో నిలకడను చూపిస్తున్న ఈ చిత్రం, యూఎస్ మార్కెట్లో సైతం లాంగ్ రన్ చూసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కేవలం కమర్షియల్ ఓరియంటెడ్ కథే కాదు, భక్తి, సామాజికత, కల్చరల్ డెప్త్ ఉన్న కథనంతో “కాంతార చాప్టర్ 1” విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంటోంది. రిషబ్ శెట్టి నటనతో పాటు డైరెక్షన్‌లోనూ మరోసారి తన టాలెంట్‌ను నిరూపించుకున్నాడు. ఇటీవల విడుదలైన సినిమాల్లో “కాంతార చాప్టర్ 1” వసూళ్ల పరంగా దూసుకెళ్తుండటంతో, ఈ చిత్రం మొత్తం కలెక్షన్ల పరంగా ఎంత రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది. రిషబ్ శెట్టి క్రియేట్ చేసిన ఈ క్రియేటివ్ యూనివర్స్ ఇంకా ఎన్ని చాప్టర్లు చూపించబోతుందన్నది కూడా సినీప్రియులలో చర్చనీయాంశంగా మారింది. పంజుర్లి, భూతకోళ, పూర్తిగా జానపద నేపథ్యంలో ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కించాడు రిషబ్ శెట్టి
ఈ సినిమా తొలి రోజే దాదాపు రూ. 89 కోట్ల గ్రాస్ వసూల్లతో సంచలనం సృష్టించగా, హిందీ బాక్సాఫీస్ దగ్గర కూడా మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ఈ సినిమా 5 రోజుల్లో దాదాపు రూ. 365 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. 6వ రోజు వర్కింగ్ డే నేపథ్యంలో కాస్త నెమ్మదించినా ఓవరాల్ గా అన్ని ఏరియాల్లో డీసెంట్ వసూళ్లనే రాబట్టింది అని చెప్పాలి. ఈ వీకెండ్ లో బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా డిసెంట్ వసూళ్లనే రాబట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాంతార చాప్టర్ 1లో ఫస్ట్ హాఫ్ ల్యాగ్ అనిపించినా.. సినిమాలో మొదటి సీన్.. ఇంటర్వెల్ బ్యాంగ్.. ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్ ఈ చిత్రాన్ని పూర్తిగా నిలబెట్టాయి. ముఖ్యంగా సెకండాఫ్ లో రిషబ్ శెట్టి తన నట విశ్వరూపం చూపించి అలరించాడు.