Kannappa | డైనమిక్ హీరో విష్ణు మంచు ప్రధాన పాత్రలో నటించిన డివైన్ యాక్షన్ డ్రామా ‘కన్నప్ప’ థియేటర్లలో సూపర్ హిట్ప్ కాగా, ఇప్పుడు ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 19న మధ్యాహ్నం 12 గంటలకు జెమినీ టీవీలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ మరియు అవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై డా. ఎం. మోహన్ బాబు భారీ స్థాయిలో నిర్మించారు. దర్శకత్వ బాధ్యత ముఖేష్ కుమార్ సింగ్ వహించారు. ముఖ్యంగా, విష్ణు మంచుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో పాపులర్ అయిన స్టార్ హీరోలు కూడా ఈ సినిమాలో కనిపించటంతో ప్రేక్షకులు మూవీపై చాలా ఆసక్తి చూపించారు.
‘కన్నప్ప’ థియేటర్లలో భక్తి, యాక్షన్, గ్రాఫిక్స్ మిశ్రమంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాక, ఓటీటీలో కూడా విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో చిత్రబృందం దీపావళి రోజు టీవీ ప్రీమియర్ కానుందని తెలియజేస్తూ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. థియేటర్ మ్యాజిక్ టీవీలోనూ రిపీట్ కానుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శరత్ కుమార్, బ్రహ్మానందం, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్ వంటి పాన్ ఇండియా స్టార్లు నటించారు. వీరిలో కొన్ని పాత్రలు గెస్ట్ రోల్స్ అయినప్పటికీ, ప్రేక్షకులకి మంచి వినోదాన్ని పంచేలా రూపొందించబడ్డాయి.
స్టీఫెన్ దేవాస్సీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాండియర్ సెట్లు సినిమా విజువల్‌గా ఆకట్టుకునేలా ఉన్నాయి. అనేక భాషల్లో రూపొందించబడిన ‘కన్నప్ప’ ను సన్ నెట్వర్క్ చానళ్లలో ఒకేసారి ప్రసారం చేయడం కూడా ప్రత్యేక విషయం. ఈ దీపావళి, ఫ్యామిలీతో కలిసి ‘కన్నప్ప’ను చూసే అవకాశం మిస్ అవ్వకండి!