మంచు విష్ణు టైటిల్ రోల్‌ని పోషిస్తున్న ‘కన్నప్ప’ చిత్రంలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, ప్రభాస్, శరత్‌కుమార్ వంటి అగ్ర నటులు భాగమైన విషయం తెలిసిందే. మహాశివభక్తుడు కన్నప్ప ఇతివృత్తంతో రూపొందిస్తున్న ఈ సినిమాలో శరత్‌కుమార్ నాథనాథుడి పాత్రలో కనిపించనున్నారు. ఆదివారం ఆయన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో ఆయన భారీ ఖడ్గాన్ని చేతబూని ఉగ్రరూపంలో కనిపిస్తున్నారు. కథానుగుణంగా ఆయన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని, ఓ యోధుడిగా ఆయన నటన ఆకట్టుకుంటుందని చిత్ర బృందం పేర్కొంది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మంచు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకురానుంది.