Kannappa | టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం కన్నప్ప (Kannappa). ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే కన్నప్ప నుంచి లాంచ్ చేసిన టీజర్‌తోపాటు కీలక పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేయగా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే లాంచ్ చేసిన శివ శివ శంకరా సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. తాజాగా ఇవాళ మేకర్స్ పాట లవ్ లిరికల్ సాంగ్ విడుదల చేశారు. హీరోహీరోయిన్ల మధ్య సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్‌ను ఇంప్రెస్ చేయడం పక్కా అని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. ఈ పాటను షాన్, సాహితీ చాగంటి పాడారు.
ఇక శివుడిపై కన్నప్పకున్న భక్తి భావాన్ని ప్రతిబింబించేలా నేటి తరానికి కనెక్ట్ అయ్యేలా సినిమా థీమ్ ఉండబోతుందని శివ శివ శంకరా పాట ఇప్పటికే హింట్ ఇచ్చేసింది. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ, స్టీఫెన్ దేవసి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ మూవీని 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, Ava Entertainment బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కన్నప్ప మూవీకి పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్, తోట ప్రసాద్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.
ఈ మూవీలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, గ్లోబల్ స్టార్ ప్రభాస్, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్‌కుమార్, శివరాజ్‌కుమార్, ఐశ్వర్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లవ్ లిరికల్ వీడియో సాంగ్..
✨”LoveSong” is out now! Feel the magic of love from #Kannappa🏹 ✨
Let your heart dance to the rhythm of emotions!Har Har Mahadev 🔱
Har Ghar Mahadev 🔥👉 Watch now:
🔗Telugu: https://t.co/UhvDCHJUoQ#HarHarMahadevॐ pic.twitter.com/VhaXkWvYGR
— BA Raju’s Team (@baraju_SuperHit) March 10, 2025
శివ శివ శంకరా లిరికల్ వీడియో సాంగ్..
Niharika| నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను.. నిహారిక ఎమోషనల్ పోస్ట్ ఎవరి గురించి అంటే..!
Anasuya Bharadwaj| ఏంటి అనసూయ.. మరీ ఇంత సీరియస్ లుక్స్ ఇస్తే ఎలా.. భయపడిపోతున్న ఫ్యాన్స్